నీ టీనేజీ..
టీనేజీ మొదలయ్యే ఆ 'పదమూడూ
టేకిటీజీ అనుకుంటె 'ఆపద మూడు.!
నైంటీను లొ శలవడిగే నీ టీనేజీ..
కాంటీను వీడకుంటే మిగుల్చు డామేజీ .!
సిక్స్ టీను అందించును స్వీటు సంథింగు ..
నెక్స్ట్ సీను కాకూడదు నెట్టు నథింగు ..!
యస్ యస్ సీ , ఎం సెట్టు టెస్ట్ ఏదైనా ,
యం పీ సీ , బై పీ సీ కొర్సేదైనా
కష్ట పడి బెష్టు రాంకో , ఇష్ట పడి బెష్టు మార్కో ,
గిఫ్టు గా నీవందుకునేదీ ,ఆనెస్టు గా నువ్వు సాధించేదీ
ఈ ఏజీ లోనే, నీ టీనేజీ లోనే..!
సినిమాలే నీ యెనిమీలు ,
టీ వీ లే నీ యాంటీలు
క్రికెట్టు లే నీ కనికట్టులు ,
ప్రేమలే నీకు కామాలు..!
ఈలలు నేర్చే ఈ వేళలొ
ఈ వలలొ పడొద్దు
భవిష్యత్తు పడగొట్టద్దు..!
అమ్రుత మూర్తులైన అమ్మ , నాన్న లను
అద్రుష్ట రూపులుగానో ,
అథమ జాతకులు గానో
తెల్చేదే నీ టీనేజీ ..!
అందుకే
వాహ్ జీ అనిపించుకో .. నీ లైఫ్ నే గిఫ్టు
పాకేజీ చేసుకో..!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి