"బంగారం" అంటూ ...అమ్మ.. హుంకారంచేస్తూ.. నాన్న.
తినమంటూ వెంటపడి.. తిననంటే..కంటతడి..!
మొరాయించకుండా.."అదుగో..బూచాడు..!" హరాయించుకోడానికి..వాము ఓ చెంచాడు..!
ఆది గురువు గా అన్ని నేర్పుతూ.. గోరు ముద్దలలో రంగరించుతు...
అమ్మ అందించిన కమ్మని ముద్దలు జేజెమ్మను మించమని దీవించి నేర్పించిన సుద్దులు..
ప్రతి చిగురు వయసు జ్ఞాపకాలు.. ప్రీతి చిగుర్చే పాయస జ్ఞాపకాలు.. చితి కాల్చలేని చిరాయు జ్ఞాపకాలు..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి